Weather Update: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు రోజుల వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలతో పాటు మరో ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ఏర్పడింది. పశ్చిమ ప్రాంతాల నుంచి వస్తున్న గాలుల...
తెలుగు రాష్ట్రాలతో పాటు మరో ఏడు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ఏర్పడింది. పశ్చిమ ప్రాంతాల నుంచి వస్తున్న గాలుల కారణంగా ఈ ద్రోణి ఏర్పడింది. దీంతో ఆయా రాష్ట్రాలపై మబ్బులు ముసుగేశాయి. ఇక బంగాళాఖాతం పై తూర్పు గాలుల కారణంగా మరో ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రాబోయే రెండు రోజులల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వారు చెబుతున్నారు. తమిళనాడు తీరం నుంచి ఓడిశా తీరం వరకూ వ్యాపించి ఉన్న ఈ ద్రోణి కారణంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక శనివారం ఆకాశం పూర్తి మేఘావృతమై ఉండగా, కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే 4 నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. పగటి పూట కంటే రాత్రి పూట ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. దీంతో చలికి జనం వణుకుతున్నారు. కాగా, శనివారం హైదరాబాద్ లో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజులు ఇదే వాతావరణం కొనగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTవయనాడ్ ఆఫీసు ధ్వంసాన్ని లైట్ తీసుకున్న రాహుల్
1 July 2022 12:30 PM GMT'ఆవో-దేఖో-సీకో'.. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
1 July 2022 12:15 PM GMTకుప్పం అభ్యర్థిపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ
30 Jun 2022 8:54 AM GMTసీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMT
CIBIL స్కోరు తెలుసుకోవడం ఎలా.. ఈ విధంగా ట్రై చేయండి..?
2 July 2022 3:00 PM GMTHealth: ధమనులు, సిరలలో రక్తం గడ్డకట్టడం చాలా ప్రమాదకరం.. ఇది ఈ వ్యాధి...
2 July 2022 2:30 PM GMTకేటీఆర్ ప్రసంగంపై విశ్వకర్మలు ఆగ్రహం.. విశ్వబ్రాహ్మణులను తాను...
2 July 2022 1:45 PM GMTహైదరాబాద్లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ...
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల...
2 July 2022 12:57 PM GMT