ఏపీ ప్రజలకు చల్లటి కబురు.. జూన్ 10లోగా నైరుతి రుతుపవనాలు


తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది....
తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో మంగళవారం ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రత మాత్రం తగ్గదని చెప్పారు
నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న అండమాన్, దక్షిణ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు వచ్చే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది.జూన్ 1నాటికి కేరళను తాకుతాయని, జూన్ 10లోగా ఏపీకి వస్తాయని అంచనావేసింది.
ఈ నెల 27న రాయలసీమ, ఉత్తరాంధ్రలో చెదురుమదురు జల్లులు పడినా, దక్షిణ కోస్తాలో వడగాలులతో ఎండ తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో చెదురుమదురు జల్లులు పడ్డాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



