Weather Report in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి వర్షసూచన

Weather Report in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం..ఏపీకి వర్షసూచన
x
weather report in ap
Highlights

Weather Report in AP: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో గురువారం అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని

Weather Report in AP: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో గురువారం అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఇంకా రాబోయే నాలుగురోజులు వాతావరణం ఎలా ఉండొచ్చో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

- అల్పపీడనం కారణంగా తీరం వెంబడి 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

- అల్పపీడన ప్రభావంతో సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉంది.

-నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

-గురువారం (13 ఆగస్టు) విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్ల్లాలో అక్కడక్కడ భారీగానూ, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

- శుక్రవారం (14 ఆగస్టు) విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవవచ్చు. మిగిలిన ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

-శనివారం (15 ఆగస్టు) తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్ల్లాల్లో అక్కడక్కడ బారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు లేదా ఒక మోస్తరు వర్షాలు పడొచ్చు.

- ఆదివారం (16 ఆగస్టు), సోమవారం (17 ఆగస్టు) రెండు రోజుల్లోనూ విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక మోస్తరుగాను.. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories