ఏపీలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

ఏపీలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు
x
Highlights

భారీ వర్షాలకు వాగులు పొంగిపోర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. సోమవారం నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కొమరిన్ నుంచి తమిళనాడు, దక్షిణాంధ్ర తీరాల మీదుగా, నైరుతి, పశ్చిమ బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. దాంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు వాగులు పొంగిపోర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. సోమవారం నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories