తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు

Andhra Pradesh: ఏపీలోకి ఇవాళ సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు

Jyothi
Published on: 7 Jun 2022 12:15 PM IST
Weather Latest Updates in Andhra Pradesh
X

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు

Andhra Pradesh: తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న వారికి వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఇవాళ సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే, ఆదివారం నుంచి కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీంతో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.

Jyothi

Jyothi

Next Story