Kolusu Parthasarathy: ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం

Kolusu Parthasarathy: ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Sept 2024 4:46 PM IST
Kolusu Parthasarathy: ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం
X

Kolusu Parthasarathy: ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం

Kolusu Parthasarathy: ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇవాళ ఏపీ సచివాలయంలో మీడియాతో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... త్వరలోనే ఏపీలో కూడా హైడ్రా తరహాలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. జగనన్న కాలనీల్లో అక్రమ నిర్మాణాలపై విచారణ ముగిసిందని చెప్పారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని పార్థసారధి స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో పనిచేసిన ప్రజాప్రతినిధులే చాలా అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు చేశారు. వాటిపై కూడా ప్రత్యేక దృష్టిసారించి కూల్చివేతలకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జర్నలిస్టుల సమస్యలపై త్వరలోనే యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story