Narasimha Rao: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలిగాం

Narasimha Rao: ప్రజలందరూ పాదయాత్రకు సహకరించాలి

Shekhar G
Published on: 28 Feb 2024 12:52 PM IST
We Were Able To Stop The Privatization Of Visakha Steel Plant Says Narasimha Rao
X

Narasimha Rao: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలిగాం

Narasimha Rao: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం అమ్మకుండా పోరాట కమిటీ ఆపగలిగిందన్నారు సీఐటీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ నరసింగరావు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 3న స్టీల్‌ప్లాంట్ పోరాట శిబిరం నుంచి విశాఖలోని గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పాదయాత్రకు సహకరించాలని కోరారు. పదేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి ఎలాంటి భారీ ప్రాజెక్టులు రాలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యమే నష్టాలకు కారణమైందని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం జరుగుతున్న పోరాటాన్ని రానున్నరోజుల్లో మరింత ఉధృతం చేస్తాన్నారు.

Shekhar G

Shekhar G

Next Story