Sajjala Ramakrishna Reddy: ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం..

Sajjala Ramakrishna Reddy: ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Arun Chilukuri
Updated on: 6 Oct 2022 3:31 PM IST
We Welcome Establishment of New Parties in Democracy Says Sajjala
X

Sajjala Ramakrishna Reddy: ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం..

Sajjala Ramakrishna Reddy: ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోవచ్చని అభిప్రాయపడ్డారు. మా విధానం మాకుందని మేము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని స్పష్టం చేశారు.

ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తున్నామని, అందుకే ప్రజలు తమను సొంతం చేసుకున్నారన్నారు. తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే మేము స్పందించాల్సి వచ్చింది. మేము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. అందరూ బాగుండాలనేదే వైసీపీ సిద్ధాంతం అని సజ్జల పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story