Anandayya Medicine: మా తల్లిదండ్రుల సమాధుల దగ్గరే మందు తయారీ చేస్తాం- ఆనందయ్య

We prepare Medicine at our Parents Graveyard: Anandayya
x

ఆనందయ్య (ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Highlights

Anandayya Medicine: నెల్లూరు జిల్లా ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందుకు ఏపీ హైకోర్టు, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందు తయారీకి సన్నాహాలు చేస్తున్నారు.

Anandayya Medicine: నెల్లూరు జిల్లా ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందుకు ఏపీ హైకోర్టు, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మందు తయారీకి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం ఆనందయ్య మామిడితోటలో భారీగా ఏర్పాట్లు చేశారు. తన తల్లిదండ్రుల సమాధుల దగ్గరే కరోనా మందు తయారు చేస్తానని ఆనందయ్య స్పష్టం చేశారు. మందుకు అవసరమైన మెటీరియల్‌ను దాతలు సమకూరిస్తే రోజుకు లక్ష మందికి పంపిణీ చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని తేల్చి చెప్పారు. రాష్ట్రమే కాదు.. దేశ వ్యాప్తంగా మందు పంపిణీకి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మొదట సర్వేపల్లి నియోజకవర్గానికి మందు పంపిణీ తర్వాతే ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ పరంగా నిబంధనలను అనుసరించి మందు పంపిణీకి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

కృష్ణపట్నం పోర్టు సమీపంలోని ఖాళీ రిలయన్స్, సీవీఆర్ ఫౌండేషన్ ప్రాంతంలో మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ రావడంతో కృష్ణపట్నం వైపుకు జనాలు కదులుతున్నారు. మరోవైపు ఇతర ప్రాంతాల వారు కృష్ణపట్నంలోకి రాకుండా నిషేధాజ్ఞలు విధించారు. గ్రామంలో 144 సెక్షన్‌ను విధించారు. ఇతర ప్రాంతాలకు 108 వాహనాలు సరఫరా చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories