Ambati Rambabu: ఈ మూడుప్రశ్నలకు బదులేది బాబూ?

Polavaram Project: మూడు ప్రశ్నలకు టీడీపీ సమాధానం చెప్పాలి

Sriveni Erugu
Published on: 22 Aug 2022 2:50 PM IST
War of Words Between TDP and YCP Over Polavaram Project
X

పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ మధ్య మాటలయుద్ధం

Polavaram Project: ఏపీలో పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పోలవరం ప్రొజెక్ట్ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. తాను మూడు ప్రశ్నలు టీడీపీకి వేస్తున్నానని దీనికి సమాధానం చెప్పాలన్నారు. పోలవరం ప్రొజెక్ట్‌‌ను కేంద్రం నిర్మిస్తానంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. 2018కి పూర్తి చేస్తామని చెప్పి ఎందుకు పూర్తి చేయలేదని చంద్రబాబును నిలదీశారు. వాళ్లు చేయలేకపోవటానికి, ఈరోజు స్లోగా పనులు జరగటానికి కారణం డయాఫ్రం వాల్ అన్నారాయన.

కాపర్ డ్యాంల నిర్మాణం లేకుండా డయాఫ్రం వాల్ ఎందుకు నిర్మించారు? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. డయాఫ్రం వాల్ దెబ్బతిన్న అంశంపై పలు సందేహాలు ఉన్నాయన్నారు. అగాధాలు లోపల ఉన్నాయి. వరదల కారణంగా లోయర్ కాపర్ డ్యాం పనులు జరగలేదు. పోలవరం పూర్తి కాకపోవటానాకి చంద్రబాబు కారణం అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మాట్లాడం సరైంది కాదన్నారు అంబటి రాంబాబు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story