ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అనిశ్చితి.. నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా?

ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అనిశ్చితి.. నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా?
x
Highlights

ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అనిశ్చితి నెలకొంది. నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చెప్పినట్లు...

ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అనిశ్చితి నెలకొంది. నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం చెప్పినట్లు ఎన్నికల బహిష్కరణ జరుగుతుందా? ఉద్యోగులు ఎలక్షన్‌కు సహకరిస్తారా ? ఇదే చర్చ జరుగుతోంది రాష్ట్రంలో ఇప్పుడు !

స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏపీలో కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. నాటకీయ పరిణామాల మధ్య ఎస్ఈసీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఈ నెల 23నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ కూడా షురూ కానుంది. ఐతే దీనిపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌కు సంబంధించి అధికారులు బిజీగా ఉన్నారని ప్రస్తుత సమయంలో ఎన్నికలు నిర్వహించడం సరైంది కాదని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఈసీ, సర్కార్ మధ్య చర్చలు జరిగాయ్. హైకోర్టు కూడా చర్చించమని చెప్పింది. సీఎస్‌తో మీటింగ్ జరిగిన వెంటనే నోటిఫికేషన్ రావడం చర్చనీయాంశంగా మారింది.

ఎస్ఈసీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తప్పుపడుతోంది. ఓవైపు కరోనా మరోవైపు వ్యాక్సిన్ పంపిణీ ఇలాంటి సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వవర్గాలు చెప్తున్నాయ్. దీంతో విషయం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. హైకోర్టులో ప్రభుత్వం హౌస్‌మోషన్ వేసింది. సోమవారం దీనిపై వాదనలు కొనసాగే అకాశాలు ఉన్నాయ్. ఇక అటు ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికలు బహిష్కరించి తీరుతామని ప్రకటించాయ్.

ఎన్నికల కోడ్‌పై సీఎస్‌కు ఈసీ నిమ్మగడ్డ రమేష్ లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే కోడ్ వర్తిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు లబ్ది చేకూరేలా పనులు, పథకాలు వద్దు అని అన్నారు. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో కోడ్ వర్తించదని చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ పథకాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందా వర్తిస్తే రాబోయే రోజుల్లో తలపెట్టిన స్కీమ్‌ల పరిస్థితి ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల వ్యవహారంలో సర్కార్ వర్సెస్ ఎన్నికల సంఘం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. నోటిఫికేషన్ ప్రకటించడంతో ఈ వ్యవహారం మరింత హీటెక్కింది. ఇలాంటి పరిస్థితుల మధ్య స్థానిక ఎన్నికలు ఎలా జరుగుతాయ్ ఏంటి అన్న చర్చ జనాల్లో మొదలైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories