Andhra Pradesh: నేడు ఏపీలో జడ్పీ ఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్ల ఎన్నికలు

Andhra Pradesh: ఉదయం 10 గంటల నుంచి కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక

Sandeep Eggoju
Updated on: 25 Sept 2021 9:36 AM IST
Voice Chairman and ZP Chairmans Election in AP Today
X
నేడు ఏపీలో జడ్పీ ఛైర్మన్స్ అండ్ వాయిస్ ఛైర్మన్స్ ఎన్నిక (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీ వ్యాప్తంగా నేడు జెడ్పీఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఉండనుంది. ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకుగాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీఛైర్మన్లను ఎన్నుకోనున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు జెడ్పీటీసీలు, కో-ఆప్షన్‌ సభ్యులతో ప్రిసైడింగ్‌ అధికారి ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం మూడుగంటలకు జెడ్పీ ఛైర్మన్‌, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్‌ఛైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. ఇక జెడ్పీఛైర్మన్లు, వైస్‌ఛైర్మన్లతో కలెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story