Omicron Cases in AP: విజయనగరం జిల్లా వ్యక్తికి ఒమిక్రాన్‌ నెగిటివ్‌

Omicron Cases in AP: ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఈ నెల 5న ఒమిక్రాన్‌ నిర్ధారణ...

Shireesha
Published on: 13 Dec 2021 4:31 PM IST
Vizianagaram Man Tested Omicron Negative said Collector Suryakumari | Omicron Cases in AP
X

Omicron Cases in AP: విజయనగరం జిల్లా వ్యక్తికి ఒమిక్రాన్‌ నెగిటివ్‌

Omicron Cases in AP: విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్‌ కేసు లేదని, గతంలో ఐర్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకగా.. ఈ నెల 11న ఆయనకు నెగిటివ్‌ వచ్చిందని అన్నారు జిల్లా కలెక్టర్‌ సూర్యకుమారి. ఈ నెల 3న ఆ వ్యక్తి శ్యాంపిల్స్‌ను సీసీఎంబీకి పంపగా.. 5న రిజల్ట్స్‌లో ఒమిక్రాన్‌గా తేలిందని, అప్పటి నుంచి ఆ వ్యక్తి హోం ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు.

రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవడంతో ఎలాంటి సూచనలు కనపడలేదని, 11న మళ్లీ శ్యాంపిల్స్‌ తీసి ల్యాబ్‌కు పంపగా నెగిటివ్‌ వచ్చిందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్‌ నిబంధనలు పాటించాలని సూచించారు జిల్లా కలెక్టర్.

Shireesha

Shireesha

Next Story