Vizag Steel Plant: విశాఖ ఉక్కుపోరు ఉధృతం

Vizag Steel Plant Protest is in Fasttrack
x

స్టీల్ ప్లాంట్ ఉద్యమం (ఫైల్ ఇమేజ్)

Highlights

Vizag Steel Plant: నేడు చలో కలెక్టరేట్‌‌కు పిలుపు * స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్

Vizag Steel Plant: విశాఖలో ఉక్కుపోరు ఉధృతమవుతోంది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తోన్న కార్మికులు నేడు చలో కలెక్టరేట్‌‌కు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చిన ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమానికి కార్మికులతో పాటు నిర్వాసితులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. విశాఖపట్నంలోని సరస్వతి పార్క్‌ నుంచి ఐక్య పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది.

మరోవైపు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్లాంట్‌ దగ్గర నిరసనలు కొనసాగుతున్నాయి. కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 48వ రోజుకు చేరుకున్నాయి. ఇక జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కూడా ఏప్రిల్ 2 నుంచి కార్మిక, ప్రజాసంఘాల జేఏసీలు రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories