MVV Satyanarayana: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఉక్కు నిరసన సెగ

MVV Satyanarayana: * కూర్మన్నపాలెం గేట్ వద్ద ఎంపీని అడ్డుకున్న కార్మికులు * ఎంపీ కారు చుట్టుముట్టి వ్యతిరేకంగా నినాదాలు

Arun Chilukuri
Published on: 29 Aug 2021 1:35 PM IST
Vizag Steel Plant Protest Against Privatization Effect to Visakha MP MVV Satyanarayana | AP News Today
X

ఎం వి వి సత్యనారాయణ (ట్విట్టర్ ఫోటో )

MVV Satyanarayana: విశాఖ వైసీపీ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణకు ఉక్కు నిరసన సెగ తగిలింది. ఆయనకు వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. విశాఖలో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. కూర్మన్నపాలెం గేట్ వద్ద నుంచి వెళుతున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కార్మికులు అడ్డుకున్నారు. పార్లమెంటులో కేంద్రాన్ని ఎందుకు నిలదీయడంలేదని ఎంపీని చుట్టుముట్టారు. కార్మికులకు మద్దతుగా వైసీపీ ఎంపీలు అందరూ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే తామంతా పార్లమెంట్ సమావేశాల్లో నిరసన తెలిపామని సర్ధిచెప్పబోయారు ఎంపీ. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ఎంపీ సత్యనారాయణను క్షేమంగా పంపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story