సీఎం జగన్‌ను కలిసిన స్టీల్‌ ప్లాంట్‌ జేఏసీ నేతలు

సీఎం జగన్‌ను కలిసిన స్టీల్‌ ప్లాంట్‌ జేఏసీ నేతలు
x

సీఎం జగన్‌ను కలిసిన స్టీల్‌ ప్లాంట్‌ జేఏసీ నేతలు

Highlights

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని విశాఖ స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు కలిశారు. విశాఖ టూర్‌లో భాగంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సీఎం జగన్‌ సమావేశమై...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని విశాఖ స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు కలిశారు. విశాఖ టూర్‌లో భాగంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో సీఎం జగన్‌ సమావేశమై చర్చించారు. అయితే, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానంచేసి కేంద్రానికి పంపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి స్టీల్ ప్లాంట్ జేఏసీ నాయకులు సూచించారు. అనంతరం, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సీఎం జగన్‌కు లేఖ అందజేశారు.

స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవడానికి పరిరక్షణ సమితి ఏర్పాటు చేశామని జేఏసీ నేతలు తెలిపారు. 4వేల 950 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఇప్పటివరకు 44వేల కోట్లు వివిధ రూపాల్లో ప్లాంట్ నుంచి లాభాలు పొందిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 8వేల 565 కోట్ల రూపాయలు లాభం చేకూరిందన్నారు. వేల కుటుంబాలు, 68 గ్రామాలు త్యాగాలు చేసి వేలాది ఎకరాలు ప్లాంట్ కు ఇవ్వడం జరిగిందని సుమారు 5లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడ్డాయని సీఎంకు గణాంకాలతో సహా వివరించారు జేఏసీ నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories