విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్‌ గేటు దగ్గర కార్మికుల నిరసనలు

లీగల్ అడ్వైసరీ ఏర్పాటుకు కార్మికుల నిరసనలు..స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్ధమైన కేంద్రం..భారీగా మోహరించిన పోలీసులు

Sandeep Reddy
Updated on: 8 July 2021 12:04 PM IST
Vizag Steel Plant Employees Protest For Legal Advisory Services
X

విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్‌ గేటు దగ్గర కార్మికులు నిరసన

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్‌ గేటు దగ్గర కార్మికులు నిరసన చేపట్టారు. స్టీల్ ప్లాంట్ అమ్మకంపై లీగల్ అడ్వైజరీ ఏర్పాటు కోసం కార్మికులు ఆందోళనకు దిగారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్రం సిద్ధమయ్యింది. నిరసనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తోన్న కార్మికులు గతంలో చలో కలెక్టరేట్‌‌కు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చిన ఆ చలో కలెక్టరేట్ కార్యక్రమానికి కార్మికులతో పాటు నిర్వాసితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. విశాఖపట్నంలోని సరస్వతి పార్క్‌ నుంచి ఐక్య పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆ పాదయాత్ర జరిగింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story