Vizag Steel Plant: కలకలం రేపుతున్న స్టీల్‌‌ప్లాంట్‌ ఉద్యోగి సూసైడ్ నోట్

Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్ ప్నైవేటీకరణపై ఉద్యమం ఉధృతమైన వేళ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట తీవ్ర కలకం రేపుతోంది.

Arun Chilukuri
Published on: 20 March 2021 5:33 PM IST
Vizag Steel Plant Employee Suicide Letter Creates Tension
X

Vizag Steel Plant: కలకలం రేపుతున్న స్టీల్‌‌ప్లాంట్‌ ఉద్యోగి సూసైడ్ నోట్

Vizag Steel Plant: స్టీల్‌ప్లాంట్ ప్నైవేటీకరణపై ఉద్యమం ఉధృతమైన వేళ ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట తీవ్ర కలకం రేపుతోంది. ప్రస్తుతం స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు కోసం గాజువాక పోలీసులు గాలిస్తున్నారు. గాజువాక సింహగిరి కాలనీలో నివాసముంటున్న అతని ఇంటికి వెళ్లిన పోలీసులు కుటుంబ సభ్యులను విచారించారు. శ్రీనివాస్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండడంతో అతడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ప్రియమైన కార్మిక సోదరుల్లారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలమని లేఖలో రాశారు శ్రీనివాసరావు. కాసేపట్లో జరగబోయే ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వద్దని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ ఉక్కు ఉద్యమం కోసం నా ప్రాణాన్ని త్యాగం చేస్తున్నా. ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతి అవుతా. నా ప్రాణత్యాగం నుంచే ఈ పోరాటం మొదలు కావాలని లేఖలో రాశారు శ్రీనివాసరావు. ఉక్కు కార్మిక గర్జన నేపధ్యంలో శ్రీనివాస రావు లేఖ తీవ్ర కలకలం రేపుతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story