Vishnu Vardhan Reddy: మాజీ మంత్రి కొడాలి నానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సవాల్

Vishnu Vardhan Reddy: ఏపీలో వైసీపీకి అనుకూల ఓటే లేనప్పుడు.. చీలిక అనే ప్రస్తావనే రాదని కామెంట్

Dhatripriya
Published on: 18 May 2023 7:19 PM IST
Vishnu Vardhan Reddy Challenged To Kodali Nani
X

Vishnu Vardhan Reddy: మాజీ మంత్రి కొడాలి నానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సవాల్

Vishnu Vardhan Reddy: AP మాజీ మంత్రి, గుడివాడ MLA కొడాలి నానికి BJP నేత విష్ణువర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్‌ విసిరారు. YCP ప్రభుత్వం ఇచ్చిన హామీలు కనీసం గుడివాడలోనైనా పూర్తిగా నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ప్రజా చార్జిషీట్‌పై చర్చకు సిద్ధమా అని విష్ణువర్ధన్ రెడ్డి నిలదీశారు. రేపు గన్నవరం బస్టాండ్ దగ్గర బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కొడాలి నానికి చాలెంజ్ విసిరారు. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో BJP నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో BJP ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలను గెలవబోతోందని చెప్పారు. గతంలో ప్రధాని మోడీని ఓడించాలని ప్రచారం చేసిన పార్టీలు.. ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని విమర్శించారు. APలో YCPకి అనుకూల ఓటే లేనప్పుడు.. చీలిక అనే ప్రస్తావనే రాదని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తాగేందుకు నీరు లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతోందని మండిపడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story