సంప్రదాయ రీతిలోనే దీపావళి పండుగ సంబరాలు..సిద్ధం అవుతున్న విశాఖ ప్రజలు (వీడియో)

సంప్రదాయ రీతిలోనే దీపావళి పండుగ సంబరాలు..సిద్ధం అవుతున్న విశాఖ ప్రజలు (వీడియో)
x
Highlights

బాణసంచా వెలుగుల వెనుక దాగి వున్న కాలుష్యాన్ని పక్కనపెడుతూ సంప్రదాయ రీతిలో పండుగ సంబరాలను జరుపుకునేందుకు విశాఖ వాసులు ఓటు వేస్తున్నారు.

కాంతులీనే దీపాలను వెలిగిస్తూ...రంగురంగుల రంగవల్లికలను తీర్చిదిద్దూతు...తియ్యని రుచులను మేళవిస్తూ జరుపుకునే పండుగ దీపావళి... అయితే బాణసంచా వెలుగుల వెనుక దాగి వున్న కాలుష్యాన్ని పక్కనపెడుతూ సంప్రదాయ రీతిలో పండుగ సంబరాలను జరుపుకునేందుకు విశాఖ వాసులు ఓటు వేస్తున్నారు.

ప్రభుత్వం రెండు గంటలపాటు దీపావళి టాపాసులు వెలిగించాలన్న నిబంధనలను పాటిస్తూ పొల్యూషన్ ఫ్రీ ఫెస్టివల్ కు వెలకమ్ చెబుతున్నారు. విశాఖ లో దీపావళి పండుగపై స్పెషల్ రిపోర్ట్.......

కష్టం అనే చీకటిని తొలగించుకుని విజయం అనే ఆనందాన్ని పంచుకునేదే దీపావళి...నరకాసుర వధ తరువాత ప్రజలు తమకు పట్టిన రాక్షస పీడ వదిలినందుకు తమజీవితాల్లో వెలుగులు నిండినందుకు ప్రతీకగా ఈ పండుగ ను చేసుకుంటారు. దీపావళి అనగానే దీపాలతో పాటు క్రాకర్స్ సందడి కనిపిస్తుంది. పండుగ వేళ క్రాకర్స్ సౌండ్ కు చెవుల్లో రీసౌండ్ వస్తుంది. టాపాసుల మోతతో హడావుడి వుంటుంది. అయితే ఇదంతా పర్యావరణం కు ఎంతో హాని కలిగిస్తుండడంతో పర్యావరణ హితంగా దివాళీని జరుపుకునేందుకు వైజాగ్ పబ్లిక్ ఆసక్తి చూపిస్తున్నారు.

పండగలు సంప్రదాయాలు ఆరోగ్యాన్ని అభివృద్ధిని కాంక్షించేలా జరుపుకునేందుకు ముందుకు వచ్చారు. అందమైన దీపాలు వెలిగుంచుకుని..అందమైన పూలతో ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దటంతోపాటు కాంతులీనే రకరకాల దీపాలను వెలిగిస్తున్నారు. ప్రభుత్వం కూడా కేవలం గ్రీన్ కాకర్స్ ను వాడాలని.రెండు గంటలు మాత్రమే క్రాకర్స్ వెలిగించాలని ఆదేశాలు జారీ చేయడంతో అందుకు తగినట్లు విశాఖ వాసులు ఫెస్టివల్ ప్లాన్ చేసుకుంటున్నారు.

వెలుగులు పంచే దీపావళి అందరి ఇంటా ఆనందాలు కలిగించాలని, చీకట్లు తొలగిపోయి వెలుగులు నింపాలని ఆశిద్దాం. పర్యావరణ హితమైన పండుగను జరుపుకుందాం...

Show Full Article
Print Article
Next Story
More Stories