విశాఖను కమ్మేసిన పొగమంచు.. మండూస్ సైక్లోన్ తర్వాత మారిన వాతావరణం

* ఏజెన్సీని తలపిస్తున్న నగర పరిసరాలు.. నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం

R Tripura Malini
Published on: 13 Dec 2022 9:22 AM IST
Vishakapatnam Covered With Thick Fog
X

విశాఖను కమ్మేసిన పొగమంచు.. మండూస్ సైక్లోన్ తర్వాత మారిన వాతావరణం

Visakhapatnam: విశాఖలో దట్టమైన పొగమంచు ఆవరించింది. పొగమంచులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండూస్ సైక్లోన్ తర్వాత విశా‌ఖలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగర పరిసరాలు ఏజెన్సీని తలపిస్తోంది. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అందాలు మనస్సును దోచుకుంటున్నాయి. దారులు సైతం కనపడని విధంగా పొగమంచు దుప్పటిలా భూమిని కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story