Visakhapatnam RTC Bus Theft: మందు కోసం 'మహా' దొంగతనం.. విశాఖలో ఆర్టీసీ బస్సు మాయం.. సీన్ కట్ చేస్తే షాకింగ్ నిజాలు!

Visakhapatnam RTC Bus Theft
x

Visakhapatnam RTC Bus Theft: మందు కోసం 'మహా' దొంగతనం.. విశాఖలో ఆర్టీసీ బస్సు మాయం.. సీన్ కట్ చేస్తే షాకింగ్ నిజాలు!

Highlights

Visakhapatnam RTC Bus Theft: విశాఖలో వింత దొంగతనం! మద్యం తాగేందుకు డబ్బులు లేవని ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడో కిలాడీ డ్రైవర్. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు.

Visakhapatnam RTC Bus Theft: మద్యం వ్యసనం మనిషిని ఏ స్థాయికైనా దిగజార్చుతుందనడానికి విశాఖలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. మద్యం తాగేందుకు డబ్బులు లేక ఓ వ్యక్తి ఏకంగా రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సునే దొంగిలించాడు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ వింత దొంగతనం స్థానికంగా పెను కలకలం రేపింది.

అసలేం జరిగింది?

టీవీ నాయుడు అనే వ్యక్తికి చెందిన ఆరు బస్సులు ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. ఈ నెల 16న శ్రీకాకుళం నుంచి వచ్చిన బస్సును (AP 39UX 2888) డ్రైవర్ అప్పారావు 197 లీటర్ల డీజిల్ ఫుల్ చేయించి, రాత్రి 9:45 గంటల సమయంలో మద్దిలపాలెం డిపో పార్శిల్ కౌంటర్ వద్ద పార్క్ చేశారు. అయితే, మరుసటి రోజు ఉదయం వచ్చి చూసేసరికి బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్, యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

సీసీటీవీ కెమెరాల్లో గుట్టురట్టు..

యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎంవీపీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. బస్సు లంకిలపాలెం జంక్షన్ వైపు వెళ్లినట్లు గుర్తించారు. దర్యాప్తులో అదే యజమాని వద్ద డ్రైవర్‌గా పనిచేసే ఈగల పైడిరాజుపై అనుమానం రావడంతో గాలింపు ముమ్మరం చేశారు. ఈ నెల 19న రామా టాకీస్ సమీపంలో బస్సుతో సహా పైడిరాజును పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

డీజిల్ అమ్ముకుని తాగడానికేనా?

పోలీసుల విచారణలో నిందితుడు చెప్పిన సమాధానం విని అధికారులు అవాక్కయ్యారు. తాను మద్యానికి బానిసనని, బస్సులోని ఫుల్ ట్యాంక్ డీజిల్ అమ్ముకుని ఆ డబ్బుతో మద్యం తాగాలనే ప్లాన్‌తోనే బస్సును ఎత్తుకెళ్లినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.

పాత నేరస్థుడే.. పైడిరాజు ఇలాంటి నేరం చేయడం ఇది మొదటిసారి కాదు.

గతేడాది: ద్వారకానగర్ బస్టాండ్‌లో బస్సును దొంగిలించి, డీజిల్ అమ్ముకుని రూ. 4 వేలు సంపాదించాడు.

ఆ తర్వాత బస్సును హైవేపై వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అప్పట్లోనే టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ప్రస్తుతం నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు బస్సును స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories