పీఎం కేర్స్ నిధికి విశాఖ పోర్ట్ ట్రస్ట్ భారీ విరాళం

S. Srikanth
Published on: 29 April 2020 9:54 PM IST
పీఎం కేర్స్ నిధికి విశాఖ పోర్ట్ ట్రస్ట్ భారీ విరాళం
X

విశాఖపట్నం: కరోనా సంక్షోభం నేపథ్యంలో పీఎం కేర్స్ నిధికి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ భారీగా విరాళం ప్రకటించింది. ట్రస్ట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి రూ. కోటి ఇస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు ప్రకటించారు. అదేవిధంగా పోర్ట్ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనం రూ.62 లక్షలు పీఎం కేర్స్ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.

మొత్తంగా విశాఖ పోర్ట్ తరఫున పీఎం కేర్స్ నిధికి ఒక కోటీ 62 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని పోర్టు చైర్మన్ రామమోహనరావు వెల్లడించారు. వీటితో పాటుగా పెన్షనర్లు ప్రతి ఒక్కరు తమ పెన్షన్ నుంచి రూ.వెయ్యి చొప్పున పీఎం కేర్స్ నిధికి అందజేశారు.


S. Srikanth

S. Srikanth

Next Story