Nakka Anand Babu: మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ పోలీసుల నోటీసులు

*సోమవారం రాత్రి ఆనంద్‌బాబు ఇంటికి వెళ్లి నోటీసులిచ్చిన పోలీసులు *పోలీసుల నోటీసులు తీసుకునేందుకు నిరాకరించిన ఆనంద్‌బాబు

Shilpa
Updated on: 19 Oct 2021 8:08 AM IST
Visakhapatnam Police Notices to Former Minister Nakka Anandbabu
X

మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ పోలీసుల నోటీసులు(ఫైల్ ఫోటో)

Nakka Anand Babu: మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ పోలీసులు నోటీసులిచ్చారు. నక్కా ఇంటికి వెళ్లిన పోలీసులు గంజాయి రవాణాకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులిచ్చారు. విశాఖ మన్యం నుంచి గంజాయి రవాణాపై ప్రెస్‌మీట్ పెట్టిన ఆనంద్‌ బాబు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు నోటీసులు జారీ చేశారు. మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెబితే స్టేట్‌మెంట్‌ రికార్టు చేసుకుంటామని తెలిపారు. పోలీసుల నోటీసు తీసుకునేందుకు ఆనంద్‌బాబు నిరాకరించారు. దీంతో పోలీసులు ఉదయం మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు.

అయితే అర్థరాత్రి పోలీసులు తన ఇంటికి రావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు నక్కా ఆనంద్‌బాబు. పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి గంజాయి స్థావరాలపై దాడి చేస్తే రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆరోపణలు చేస్తే నిరూపించాల్సింది పోయి తిరిగి సాక్ష్యాలు అడుగుతారా అంటూ ఫైర్ అయ్యారు ఆనంద్‌బాబు. మాజీ మంత్రిగా మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు.

గంజాయి రవాణాపై ఆధారాలు ఇవ్వాలని ఆనంద్‌బాబును అడిగినట్లు నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో ఆధారాలు లభిస్తాయని నర్సీపట్నం నుంచి గుంటూరు వచ్చామని తెలిపారు. ఆనంద్‌బాబు అర్ధరాత్రి స్టేట్‌మెంట్‌ ఇవ్వను అన్నారని అందుకే మంగళవారం ఉదయం వస్తామని చెప్పామన్నారు.

Shilpa

Shilpa

Next Story