విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...

Visakhapatnam New Bride Death Mystery Revealed by AP Police | Live News Today
x

విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో వీడిన మిస్టరీ...

Highlights

Visakhapatnam: పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పిన వధువు...

Visakhapatnam: విశాఖ మధురవాడలో నవవధువు మృతి కేసులో మిస్టరీ వీడింది. ఫోన్ డేటా సీడీఆర్ ఆధారంగా కేసును ఛేదించారు పీఎంపాలెం పోలీసులు. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో నవవధువు తన ప్రాణాలు పోగొట్టుకున్నట్లు నిర్ధారణకొచ్చారు. పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాలో చాటింగ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

పరవాడకు చెందిన మోహన్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సరైన ఉద్యోగం లేకపోవడంతో మోహన్ పెళ్లికి సమయం కోరినట్లు సమాచారం. పెళ్లి ఆపేందుకే నవవధువు విషపదార్థం తిన్నట్లు గుర్తించారు. ఇక ఆరోగ్యం క్షీణించి ఈనెల 11న పెళ్లి పీటలపై నవవధువు కుప్పకూలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories