పర్యాటక రంగం వైపు దూసుకుపోతున్న విశాఖ

పర్యాటక రంగం వైపు దూసుకుపోతున్న విశాఖ
x
Highlights

*రుషికొండ వద్ద పర్యాటక ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు *65 ఎకరాల్లో సమీకృత పర్యాటక సముదాయం *ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ కోసం ప్రతిపాదనలు ఆహ్వానం

స్మార్ట్ సిటీ విశాఖ పర్యాటక రంగం వైపు దూసుకుపోతుంది. ఇంతకుముందు కాపులుప్పాడ గ్రేహౌండ్స్ కొండపై 30 ఎకరాల్లో రాష్ట్ర గెస్ట్ హౌస్ నిర్మాణానికి సిద్ధమవ్వగా, తాజాగా రుషికొండ వద్ద పర్యాటక ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది.

విశాఖలో మరో భారీ ప్రాజెక్టు రూపకల్పనకు పర్యాటక రంగం అడుగులు వేస్తోంది. సముద్రానికి అభిముఖంగా 65 ఎకరాల్లో పర్యాటకులను ఆకట్టుకునేలా సమీకృత పర్యాటక సముదాయం నిర్మించనుంది. ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ కోసం ఆసక్తి ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఏపీ టీడీసీ ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఈనెల 25 నుంచి ఆర్ఎస్పీ వివరాల డౌన్లోడ్ కు అవకాశం కల్పించగా.. ఆసక్తి చూపిన సంస్థలకు గత నెల 28న విజయవాడలోని ఏపీటీడీసీ కార్పొరేట్ కార్యాలయంలో ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఆపై ఫిబ్రవరి 4లోగా ప్రతిపాదనలు పంపించాలని గడువు విధించారు.

రుషికొండ వద్ద చేపట్టే ఈ ప్రాజెక్టు మొదటి దశ పనుల కోసం ప్రభుత్వం 82 కోట్లు ఖర్చు చేయనుంది. కేవలం ఇక్కడి స్థలాన్ని అభివృద్ధి చేయడం కోసమే 58.32 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఏపీటీడీసీ ప్రాజెక్టు వివరాల్లో చూపించింది. రెండో దశ పనుల్లో భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు అందులో పేర్కొంది. పర్యాటకుల భవన సముదాయంలోనే అతిథి గృహాలు, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్లు, భోజన హోటళ్లు, వినోద ప్రదర్శనా కేంద్రాలు, క్రీడల నిర్వహణ ప్రాంతాలు ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు.

ఎక్కడా లేని విధంగా సముద్ర అందాలను కొండపై నుంచి అద్భుతంగా వీక్షించేందుకు వీలుండటంతో పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పుడున్న భవనాలన్నింటినీ పూర్తిగా తొలగించనున్నట్లు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories