Appalaraju: అనేక అధ్యయనాల అనంతరం రాజధానిగా విశాఖ

Appalaraju: అన్ని రాష్ట్రాలను ఒకే రీతిలో చూడాలన్నదే మా భావన

Dhatripriya
Published on: 1 Feb 2023 5:49 PM IST
Visakhapatnam As The Capital After Many Studies
X

Appalaraju: అనేక అధ్యయనాల అనంతరం రాజధానిగా విశాఖ 

Appalaraju: రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అనేక అధ్యయనాలు చేసి విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించామన్నారు మంత్రి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా రూరల్‌ మండలం పెద్దపాడు జాతీయ రహదారి సమీపంలో జిల్లా వైసీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అన్ని రాష్ట్రాలను ఒకే రీతిలో చూడాలన్నదే మా భావన అన్నారు. కొందరు ఏపీకి రాజధాని ఏది అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారన్న ఆయన మాది ఆంధ్రప్రదేశ్‌ మా రాజధాని విశాఖ దీన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఏపీ రాజధాని విశాఖ అని అఫీషియల్‌గా ప్రకటించారని తెలిపారు. త్వరలోనే ఓ మంచి ముహూర్తాన విశాఖలో సీఎం జగన్‌ అడుగు పెట్టబోతున్నారన్నారు. చంద్రబాబు తన అనుయాయుల కోసం అమరావతిని ల్యాండ్‌ స్కామ్‌గా తయారు చేశారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.

Dhatripriya

Dhatripriya

Next Story