Visakha Shipyard Accident: విశాఖలో క్రేన్ ప్రమాదానికి కారణం అదే.. కమిటీ నివేదిక!

Visakha Shipyard Accident: విశాఖలో క్రేన్ ప్రమాదానికి కారణం అదే.. కమిటీ నివేదిక!
x
Visakha Shipyard Accident
Highlights

Visakha Shipyard Accident: ఈనెల 1వ తేదీన విశాఖపట్నం హిందూస్తాన్ షిప్ యార్డులో జరిగిన క్రేన్ ప్రమాదానికి కారణం క్రేన్ నిర్మాణంలో లోపమే అని విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు

Visakha Shipyard Accident: ఈనెల 1వ తేదీన విశాఖపట్నం హిందూస్తాన్ షిప్ యార్డులో జరిగిన క్రేన్ ప్రమాదానికి కారణం క్రేన్ నిర్మాణంలో లోపమే అని విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. ఈ ఘటనపై ఐదుగురు ఆంధ్రా యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విశాఖ ఆర్డిఓ, ఆర్ అండ్ బి ఎస్‌ఈలతో నియమించిన కమిటీ బుధవారం తన నివేదిక సమర్పించినట్టు అయన చెప్పారు. కమిటీ వారం రోజులపాటు క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి‌ నివేదిక అందించిందని కలెక్టర్ అన్నారు.

క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం‌ స్పష్టంగా కనిపించిందని, 70 టన్నుల‌ లోడ్‌కి సంబంధించి క్రేన్‌ ట్రయల్‌ రన్ నిర్వహిస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని నిపుణుల కమిటీ నివేదికలో‌ స్పష్టం చేసిందని తెలిపారు. క్రేన్‌కి సంబంధించి కార్బన్ బ్రషెష్ పడిపోవడం, ఇన్సులేటర్స్ పాడై మూడుసార్లు మార్చారని తెలిపారు. గతంలో ట్రయల్‌ రన్ చేస్తున్న సమయంలోనే గేర్ బాక్స్‌లో ఆయిల్ లీకేజ్ జరిగిందని వివరించారు.

నిపుణులతో లోడ్ టెస్టింగ్ తప్పనిసరిగా జరగాల్సి ఉండగా అటువంటిదేమీ నిర్వహించలేదన్నారు. క్రేన్ స్ట్రక్చరల్ డిజైనింగ్‌, డ్రాయింగ్స్ థర్డ్‌పార్టీతో పరిశీలించలేదని స్పష్టం చేశారు. ప్రమాదం కేవలం పది సెకన్లలోనే జరిగిపోయిందని.. ఒకవేళ ఈ విషయంలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories