ఏపీలో దేవాలయాలపై దాడుల ఘటనపై స్వామి స్వరూపానంద సీరియస్

Arun Chilukuri
Published on: 2 Jan 2021 7:44 PM IST
ఏపీలో దేవాలయాలపై దాడుల ఘటనపై స్వామి స్వరూపానంద సీరియస్
X

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సీరియస్ అయ్యారు. అసాంఘిక శక్తులను నియంత్రించేందుకు దేవాదాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్టతో పాటు, భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను నిరోధించాలన్నారు. ఆలయాల భద్రత విషయంలో కిందిస్థాయి ఉద్యోగులను కూడా అప్రమత్తం చేయాలని తెలిపారు. మంత్రి వెల్లంపల్లితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆలయాల దాడులపై చర్చించిన స్వామి స్వరూపానందేంద్ర దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story