విశాఖ పోర్ట్ ట్రస్ట్ మరో అరుదైన రికార్డు.. ఒక్క రోజులో 3.73 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా...

Visakha Port Trust Rare Record in Transporting Goods | AP Live News
x

విశాఖ పోర్ట్ ట్రస్ట్ మరో అరుదైన రికార్డు.. ఒక్క రోజులో 3.73 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా...

Highlights

Visakha Port: గతంలో 3.70 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణా...

Visakha Port: విశాఖ పోర్ట్ ట్రస్ట్ మరో అరుదైన రికార్డును సాధించింది. ఒకే రోజులో అత్యధిక సరుకును రవాణా చేసి ఘనతను సాధించింది. ఇన్నర్, అవుటర్ హార్బర్, SPM ల నుంచి 3.73 లక్షల మెట్రిక్ టన్నుల సరుకును రవాణా చేసి రికార్డ్ సృష్టించింది. ఏప్రిల్ 25న పోర్టుకు వచ్చిన నౌకల ద్వారా ఈ సరుకును రవాణా చేశారు. 2021లో పోర్టు సాధించిన 3.70 లక్షల మెట్రిక్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ఇప్పటి వరకూ రికార్డులలో ఉంది.

తాజాగా ఈ ఘనతను పోర్టు అధిగమించింది. దీంతో పోర్టు చైర్మన్ కే.రామమోహనరావు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఘనతను సాధించిన ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్, సిబ్బందిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధించి పోర్టు అభివృద్ధికి నిరంతం కృషి చేయాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories