అందాల విశాఖ తీరం.. కానుంది శ్రమ జీవుల ఉపాధికి ఆలంబనం!

అందాల విశాఖ తీరం.. కానుంది శ్రమ జీవుల ఉపాధికి ఆలంబనం!
x
Highlights

విశాఖ తీరం అందాలకు కేంద్రం. కానీ ఇప్పుడు ఆదాయ కేంద్ర బిందువుగా అవతరించనుంది. సముద్ర ఉత్పత్తులపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. అక్వా రంగాన్ని అభివృద్ధి...

విశాఖ తీరం అందాలకు కేంద్రం. కానీ ఇప్పుడు ఆదాయ కేంద్ర బిందువుగా అవతరించనుంది. సముద్ర ఉత్పత్తులపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. అక్వా రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది. సువిశాల విశాఖ తీరం మత్స్యసంపదలో దూసుకెళ్తోంది. శ్రమజీవులకు ఉపాధి కల్పించి, అక్కున చేర్చుకుంటోంది. తాజాగా ప్రభుత్వం అక్వా రంగంపై దృష్టి సారించడంతో మరింత ఉపాధి అవకాశాలు పెరగడం ఖాయం.

విశాఖ జిల్లాలో సువిశాల సముద్ర తీర ప్రాంతం ఉంది. దాదాపు 32కీ.మీ తీర ప్రాంతంలో వేలాదిమంది మత్స్యకారులు, చేపల వేట, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాదు దేశ మత్స్య సంపదలో 23శాతం ఏపీ నుంచి రావడం గమనార్హం. మరోవైపు సముద్ర ఉత్పత్తులను మరింత పెంచడానికి ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో 900 హెక్టార్లలో ఆక్వా కల్చర్ సాగవుతోంది. వీటితోపాటు అనుబంధరంగాలను కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రొయ్యల శుద్ధి కేంద్రాలు, చేపల ఎగుమతి కేంద్రాలు, సీడింగ్ వంటి అనుబంధ రంగాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

అక్వా కల్చర్ ను అభివృద్ధి చేసే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, చేపలు, రొయ్యల పెంపకం, వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టిపెడుతోంది. ఇందుకోసం ఉపాధి మార్గాలను పెంచేందుకు ఇన్వెస్టర్లను ప్రొత్సహిస్తోంది ప్రభుత్వం. ఇదే జరిగితే భవిష్యత్తులో అంతర్జాతీయ మత్స్య రంగంలో విశాఖ పేరు మార్మోగడం ఖాయం.

Show Full Article
Print Article
Next Story
More Stories