Visakha Bandh: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు విశాఖ బంద్‌

Visakha Bandh: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో బంద్...

Shireesha
Published on: 28 March 2022 8:26 AM IST
Visakha Bandh Today against Vizag Steel Plant Privatisation | AP Live News
X

Visakha Bandh: స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు విశాఖ బంద్‌

Visakha Bandh: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి ఇవాళ విశాఖ బంద్‌కు పిలుపునిచ్చింది. దానికి మద్దతుగా అన్ని కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. మద్దిలపాలెం కూడలి వద్ద అఖిలపక్ష నేతలు నిరసన తెలుపుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. ప్రధాని మోడీ, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

తమ అందరి అజెండా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకోవడమేనని చెప్తున్నారు. ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని.. ప్రైవేటుపరం చేస్తే ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయని అఖిలపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛంద బంద్‌లో భాగంగా విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి.

Shireesha

Shireesha

Next Story