TTD EO Dharma Reddy: లక్కీడిప్‌లో విఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు

TTD EO Dharma Reddy: సిగ్నల్ సమస్యతో లక్కీడిప్ ఎంపికైన వారికి మెసెజ్‌లు రావడం లేదు

Jyothi
Updated on: 5 April 2024 3:15 PM IST
VIP Break Darshan Tickets at Lucky Dip
X

TTD EO Dharma Reddy: లక్కీడిప్‌లో విఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు

TTD EO Dharma Reddy: తిరుమలలో వీఐపీ బ్రేక్ సైతం లక్కీ డీప్ ద్వారా అందించాలని భక్తులు కోరుతున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులు సమస్యలు, సూచనలు తెలియచేశారని చెప్పారు. లక్కీ డీప్ ద్వారా ఎంపిక అయిన వారికి సిగ్నల్ సమస్యతో మెసెజ్ లు రావాడం లేదని చెప్పారు. సాధారణంగా ఆర్జిత సేవలను లక్కీ జీప్ ద్వారా టీటీడీ అందిస్తూ వస్తుందని.. వీఐపీ బ్రేక్ సైతం లక్కీ డీప్ ద్వారా అందించాలని భక్తులు కోరుతున్నారని చెప్పారు.

దీనిపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తామన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని తొలిసారి టీటీడీ తెలుగు క్యాలెండర్ భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తుందని వెల్లడించారు. మొదట విడతలో 5 వేల క్యాలెండర్స్ అందుబాటులో ఉంటాయని చెప్పారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. మజ్జిగ., అన్నపానీయాలు అందిస్తూ వేసవి నుంచి ఉపశమనం కలిగేలా చలవ పందిళ్ళు వేయించామని ఈవో తెలిపారు.

Jyothi

Jyothi

Next Story