Corona: ‎శ్రీకాకుళం జిల్లాలో కరోనా నిబంధనలు ఉల్లంఘన

Corona: మందారాడలో చేపల కోసం ఎగబడ్డ ప్రజలు * కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఒకరిపై ఒకరు పడుతున్న వైనం

Sandeep Eggoju
Published on: 4 May 2021 3:36 PM IST
Violation of Corona Rules in Srikakulam District
X

ప్రతీకాత్మక చిత్రం 

Corona: ఓ పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరోపక్క వైరస్‌ కట్టడికి అధికారులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుంటే.. అవేం పట్టవన్నట్టు చేపలను కొనేందుకు ఎగబడ్డారు మందారాడ ప్రజలు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా.. ఒకరిపై మరొకరు పడుతూ చేపలు బేరం ఆడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు యువకులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story