Kanipakam: రేపు కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో వినాయక చవితి వేడుకలు

Kanipakam: దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా

Shekhar G
Published on: 17 Sept 2023 6:04 PM IST
Vinayaka Chavithi Celebrations At Kanipakam Varasiddhi Vinayaka Temple Tomorrow
X

Kanipakam: రేపు కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయంలో వినాయక చవితి వేడుకలు

Kanipakam: వినాయకచవితి రోజున కాణిపాక వినాయక ఆలయంలో 21రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.చవితి రోజున ఉదయం నాలుగు నుంచి రాత్రి 11 గంటల వరకు సామాన్య భక్తులకు వరసిద్దుడి దర్శనాన్ని కల్పించనున్నట్లు ఆలయ ఈవో వెంకటేశ్ వెల్లడించారు.వినాయక చవితికి దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఉభయ దారుల ఆధ్వర్యంలో మూల విరాటుకు రాత్రి 12 నుంచి రెండు గంటల మధ్య అభిషేకం నిర్వహించనున్నట్లు తెలియజేశారు.

స్వామి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు ఈవో తెలిపారు. ఇక 21 రోజులపాటు నిర్వహించే బ్రహ్మో త్సవాల్లో భక్తులకు ప్రత్యేక అన్నదానం చేస్తామన్నారు. ప్రత్యేక ఉత్సవాల్లో సైతం అన్న ప్రసాదాన్ని ప్యాకెట్లు రూపంలో అందించనున్నట్లు వివరించారు

Shekhar G

Shekhar G

Next Story