ఎమ్మెల్యే బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు

ఎమ్మెల్యే బాలకృష్ణను అడ్డుకున్న గ్రామస్థులు
x
Highlights

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. లేపాక్షి – హిందూపురం రహదారిపై బైఠాయించి నిరసన...

టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను లేపాక్షి మండలంలోని గలిబిపల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. లేపాక్షి – హిందూపురం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. టీడీపీ అధికార ప్రతినిధి రమేశ్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు బాలయ్య హిందూపూరంకు వచ్చారు. హైదరాబాదు నుంచి బెంగళూరుకు చేరుకున్న బాలయ్య అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హిందూపురం వచ్చారు. బాలయ్య వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కొడికొండ చెక్ పోస్టు నుంచి హిందూపురం వచ్చే దారిలో గలిబిపల్లి క్రాస్ వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు.

లేపాక్షి-హిందూపురం మెయిన్‌రోడ్డు నుంచి గలిబిపల్లికి రోడ్డు వేసేందుకోసం భూమిపూజ చేసి సంవత్సరం కావస్తున్నా పనులు ఇంకా పూర్తికాకపోవడంపై ఎమ్మెల్యే వద్ద గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థుల సమస్యపై స్పందించిన బాలకృష్ణ సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరలోనే రోడ్డు పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్థులు వెనక్కి తగ్గారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories