తాండూర్‌లో టెన్త్ పేపర్ లీక్‌పై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు..

SSC Paper Leak: వికారాబాద్ జిల్లా తాండూరు టెన్త్ పేపర్ లీకేజీ ఘటనపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు.

Arun Chilukuri
Published on: 3 April 2023 6:09 PM IST
Vikarabad Collector Anguish Over SSC Paper Leak
X

తాండూర్‌లో టెన్త్ పేపర్ లీక్‌పై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు..

SSC Paper Leak: వికారాబాద్ జిల్లా తాండూరు టెన్త్ పేపర్ లీకేజీ ఘటనపై చర్యలకు ఉపక్రమించారు అధికారులు. నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. సూపరింటెండెంట్ గోపాల్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ శివకుమార్, స్కూల్ అసిస్టెంట్స్ బందెప్ప, సమ్మప్పలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. లీక్ ఘటనకు పాల్పడిన బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. అయితే 2017లో ఓ విద్యార్థినిని బందెప్ప లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో బందెప్పపై అప్పట్లో పోక్సో కేసు కూడా నమోదైందని ఎంఈవో వెంకటయ్య గౌడ్ తెలిపారు. బందెప్ప భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్టు చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story