రేపు కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం

Arun Chilukuri
Published on: 15 Oct 2020 9:51 PM IST
రేపు కనకదుర్గ ఫ్లైఓవర్‌ ప్రారంభం
X

బెజవాడలో నిర్మాణం పూర్తి చేసుకున్న దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు వర్చువల్ ద్వారా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి సీఎం జగన్ ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మొదటిగా ఫ్లై ఓవర్ పై ప్రయాణం చేస్తారు. కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడం ద్వారా నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఫ్లై ఓవర్ ప్రారంభంతో పాటు రూ.7584 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులకు భూమిపూజ చేయనున్నారు. ఇప్పటికే 8007 కోట్లతో పూర్తయిన 10 ప్రాజెక్టులను గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. మొత్తం 15 వేల కోట్ల పనులకు రేపు భూమిపూజ, ప్రారంభోత్సవా కార్యక్రమాలు జరుపనున్నారు. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం జరిగాక అధికారికంగా వాహనాలకు అనుమతిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story