Vijayawada: మెడికో ప్రాణాలు కాపాడిన పోలీసులు.. కాలువ వద్ద ఒంటరిగా కూర్చున్న..

Vijayawada: అమూల్య మొబైల్‌ సిగ్నల్‌ ద్వారా ఆమె ఉన్న లొకేషన్‌ను పోలీసులు ట్రేస్‌ చేశారు

R Tripura Malini
Updated on: 21 Dec 2022 7:15 PM IST
Siddhartha Medical College House Surgeon Missing
X

సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హౌస్ సర్జన్ అదృశ్యం...

Vijayawada: పోలీసుల చొరవ ఓ మెడికో ప్రాణాలను కాపాడగలిగింది. విజయవాడ సిద్దార్థ మెడికల్‌ కాలేజ్‌లో హౌస్‌ సర్జన్‌ చేస్తున్న అమూల్య మధ్యహ్నం నుంచి కనిపించకపోవడంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందిచింది. అమూల్య మొబైల్‌ సిగ్నల్‌ ద్వారా ఆమె ఉన్న లొకేషన్‌ను పోలీసులు ట్రేస్‌ చేశారు. గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి కాలువ వద్ద ఒంటరిగా కూర్చున్న అమూల్యను అదపులోకి తీసుకున్నారు. అయితే వర్క్ ప్రెషర్‌తో పాటు తాను కోరుకున్న కాలేజ్‌లో సీటు రాలేదనే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు అమూల్య సూసైడ్‌ నోట్‌లో రాసింది. పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారమే సూసైడ్‌కు యత్నించేలా చేసిందని భావిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story