CBN-Prashant Kishor: చంద్రబాబు నివాసానికి ప్రశాంత్‌ కిషోర్‌

CBN-Prashant Kishor: సన్నిహితులకు ప్రశాంత్ కిషోర్ తెలిపినట్టు గతంలో ప్రచారం

Shekhar G
Published on: 23 Dec 2023 3:52 PM IST
Vijayawada News In Telugu Political Analyst Prashant Kishor Meets Tdp Chief Chandrababu
X

CBN-Prashant Kishor: చంద్రబాబు నివాసానికి ప్రశాంత్‌ కిషోర్‌

CBN-Prashant Kishor: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. లోకేష్‌తో కలిసి చంద్రబాబు నివాసానికి ప్రశాంత్‌ కిషోర్‌ వెళ్లారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రశాంత్‌ కిషోర్‌ పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీకి ప్రశాంత్‌ కిషోర్ దూరంగా ఉన్నారు. ఇటీవల జగన్ పాలనపై ఆయన విరుచుకుపడ్డారు. ఏపీలో వైసీపీకి వ్యూహకర్తగా ఉండి తప్పు చేశానని తన సన్నిహితులతో ప్రశాంత్‌ కిషోర్ అన్నట్టు గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ భేటీ ఆసక్తిగా మారింది. కాగా జనసేన, టీడీపీ కలిసి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇటీవల జరిగిన లోకేష్‌ పాదయాత్ర ముగింపు సభలో కూడా పవన్ కల్యాణ్‌ పాల్గొని ప్రసంగించారు.

Shekhar G

Shekhar G

Next Story