దివ్య తేజస్విని కేసులో కొత్త ట్విస్ట్.. దివ్య ఇంట్లో అసలు ఏం జరిగింది?

దివ్య తేజస్విని కేసులో కొత్త ట్విస్ట్.. దివ్య ఇంట్లో అసలు ఏం జరిగింది?
x
Highlights

విజయవాడ దివ్య తేజస్విని మర్డర్‌ కేసులో కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. దివ్య తేజస్విని, స్వామి ప్రేమించుకున్నారని ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా...

విజయవాడ దివ్య తేజస్విని మర్డర్‌ కేసులో కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. దివ్య తేజస్విని, స్వామి ప్రేమించుకున్నారని ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని నిందితుడు స్వామి సోదరుడు నాగరాజు చెబుతున్నాడు. ఇద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకున్నామని స్వామి చెప్పాడని అతని సోదరుడు నాగరాజు తెలిపాడు. నిన్న రాత్రి దివ్య ఇంటికెళ్లి ఆమె తండ్రితో కూడా మాట్లాడినట్లు చెప్పాడని, అయితే అక్కడ ఏం జరిగిందో తమకు పూర్తిగా తెలియదని స్వామి సోదరుడు చెబుతున్నాడు. అసలు నిన్న రాత్రి దివ్య ఇంట్లో ఏం జరిగిందో తమకు చెప్పలేదని, అంతేకాదు ఎవరిని ఎవరు పొడిచారో కూడా తెలియడం లేదని స్వామి సోదరుడు అంటున్నాడు. ఇద్దరికీ కత్తి గాయాలయ్యాయని, అంతేవరకే తమకు తెలుసని స్వామి సోదరుడు చెబుతున్నాడు.

దివ్య, స్వామి పెళ్లి విషయం దివ్య తల్లిదండ్రులకు తెలుసా..? దివ్య, స్వామి పెళ్లిని దివ్య పేరెంట్స్ అంగీకరించలేదా? దివ్య, స్వామి ప్రేమ గురించి కూడా దివ్య తల్లిదండ్రులకు తెలుసా..? దివ్య ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీ ఎందుకు కట్టి ఉంది? చున్నీతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదెవరు? దివ్య తల్లిదండ్రులతో స్వామికి ఘర్షణ జరిగిందా? దివ్య ఇంట్లో అసలు ఏం జరిగింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు పోలీసుల దర్యాప్తులో తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories