ప్రారంభమైన కనకదుర్గ ఫ్లైఓవర్‌!

ప్రారంభమైన కనకదుర్గ ఫ్లైఓవర్‌!
x

Kanakadurga Flyover

Highlights

Kanakadurga Flyover Started : విజయవాడ నగర వాసుల చిరకాల కోరిక నేడు నెరవేరింది. గత కొద్దిరోజులుగా వాయిదాల పడుతూ వస్తున్న బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ను ఈరోజు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు.

Kanakadurga Flyover Started : విజయవాడ నగర వాసుల చిరకాల కోరిక నేడు నెరవేరింది. గత కొద్దిరోజులుగా వాయిదాల పడుతూ వస్తున్న బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ ను ఈరోజు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. అనంతరం మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. కాగా రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900రోజులలో ఈ ఫ్లైఓవర్‌ పూర్తయింది.

సాధారణంగా ఎలివేటెడ్‌ వంతెనలపై నాలుగు వరసల రహదారి నిర్మిస్తారు. అయితే కనకదుర్గ పై వంతెనను ఆరు వరసలతో నిర్మించటంతో.. దక్షిణ భారతంలో ఆరు లేన్ల తొలి ఫ్లై ఓవర్‌గా నిలిచింది. ముంబై, ఢిల్లీలో ఇలాంటి ఫ్లై ఓవర్లు ఉండగా.. మూడో ప్రాజెక్టుగా రికార్డులకెక్కింది దుర్గగుడి ఫ్లై ఓవర్‌. ఈ ఫ్లై ఓవర్‌కు డీపీఆర్‌ను అమెరికాకు చెందిన షలాడియా సంస్థ రూపొందించింది. సింగపూర్‌కు చెందిన ఏఈకామ్‌ ఫ్లై ఓవర్‌ ఆకృతులను రూపకల్పన చేసింది.

ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా భవానీ పురం నుంచి వారధి వరకు 4 వరసల రహదారి నిర్మించారు. కృష్ణలంకలో అండర్‌ పాస్‌ పూర్తి చేశారు. మొత్తం రహదారి 5 కిలోమీటర్లు కాగా.. అందులో పై వంతెన రెండున్నర కిలోమీటర్లు. ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తవటంతో విజయవాడలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. పై వంతెన నుంచి రాకపోకలు ప్రారంభం కావటంతో ఇకపై భారీ వాహనాలంతా ఈ ఫ్లై ఓవర్‌పై నుంచే వెళ్లనున్నాయి. దీంతో నగరంలో కొంతమేర ట్రాపిక్‌ కష్టాలు గట్టెక్కనున్నాయి. ఇక హైదరాబాద్‌- విజయవాడ మార్గంలోనూ ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories