Vijayawada Kanaka Durga Temple: విజయవాడ దుర్గగుడిలో కరోనా కలకలం

Vijayawada  Kanaka Durga Temple: విజయవాడ దుర్గగుడిలో కరోనా కలకలం
x
Vijayawada Kanaka Durga Temple infected with corona
Highlights

Vijayawada Kanaka Durga temple: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా ఉగ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో నిత్యం భక్తులతో కళకళలాడే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కరోనా కల్లోలం రేపుతోంది

Vijayawada Kanaka Durga Temple: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా ఉగ్ర రూపం దాల్చుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా.. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేప‌థ్యంలో నిత్యం భక్తులతో కళకళలాడే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో కరోనా కల్లోలం రేపుతోంది. లాక్ డౌన్ అనంత‌రం అనేక ఆంక్ష‌లు, స‌డలింపుల‌తో తిరిగి దర్శనాలు ప్రారంభించారు. నిర్నిత సంఖ్య‌లో భ‌క్తులను అనుమ‌తిస్తున్న‌ప్ప‌టికి.. ఆలయాల్లో కరోనా కలవరాన్ని కలిగిస్తోంది. తాజాగా ఆలయ కార్యనిర్వహణాధికారి సురేష్ తో పాటు మరో 18 మంది సిబ్బందికీ కరోనా సోకినట్లు తేలింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వీరికి వైరస్ సోకినట్లు నిర్దారించారు.

అలాగే బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో పనిచేస్తున్న వేదపండితుడు రామకృష్ణ ఘనాపాటి కరోనా బారినపడి మరణించారు. మూడురోజుల క్రితం కరోనా వైరస్‌ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూనే గురువారం ఆయన కన్నుమూశారు. ఆయన భార్య కూడా ప్రస్తుతం ఐసీయూలో కరోనాతో చికిత్స పొందుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

మరోవైపు, శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చేవారు కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆలయ కమిటీ సూచిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories