Coronavirus updates in AP: ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. ఆ జిల్లాలో అత్యధికంగా 1,351 కేసులు..

Coronavirus updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

S. Srikanth
Published on: 6 Aug 2020 7:39 PM IST
Coronavirus updates in AP: ఏపీలో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. ఆ జిల్లాలో అత్యధికంగా 1,351 కేసులు..
X

Coronavirus updates in AP: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 63,686 శాంపిల్స్ టెస్టు చేయగా.. అందులో 10,328 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1,96,789 కి చేరింది. గడచిన 24 గంటల్లో 72మంది చనిపోయారు. దీంతోమొత్తం మరణాల సంఖ్య 1753కి చేరింది. గత 24 గంటల్లో 8,514 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. మొత్తం కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,12,870కు చేరింది. మరో 82,166 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1351, కర్నూలు జిల్లాలో 1285, అనంతపురం జిల్లాలో 1112, విశాఖపట్నం జిల్లాలో 781, పశ్చిమగోదావరి జిల్లాలో 798, గుంటూరు జిల్లా 868, కడప జిల్లాలో 604, నెల్లూరు జిల్లాలో 788, శ్రీకాకుళం జిల్లాలో 682, చిత్తూరు జిల్లాలో 755, ప్రకాశం జిల్లాలో 366, కృష్ణా జిల్లాలో 363, విజయనగరం జిల్లా 575 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 27,580 పాజిటివ్ కేసులు.. తర్వాత కర్నూలు జిల్లాలో కేసులు 23,348కు చేరాయి. అనంతపురం జిల్లాలో 21,173 కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 22,99,332 సంప్లిల్స్ ను పరిక్షించడం జరిగింది.





S. Srikanth

S. Srikanth

Next Story