Vijayawada: విజయవాడ దుర్గగుడి బడ్జెట్‌ రూ.178కోట్లు

Vijayawada: ఈ ఏడాది 178 కోట్ల రూపాయలతో దుర్గమ్మ బడ్జెట్ ఏర్పాటు చేసినట్టు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు.

Arun Chilukuri
Published on: 24 March 2021 4:25 PM IST
Vijayawada Kanaka Durga Temple Board Approves RS 178 CR Budget
X

Vijayawada: విజయవాడ దుర్గగుడి బడ్జెట్‌ రూ.178కోట్లు

Vijayawada: ఈ ఏడాది 178 కోట్ల రూపాయలతో దుర్గమ్మ బడ్జెట్ ఏర్పాటు చేసినట్టు దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు తెలిపారు. కనకదుర్గ ఆలయంలో పాలకమండలి సమావేశంలో 38 అంశాలకు గానూ 36 అంశాలను ఆమోదించినట్టు వెల్లడించారు. ఇక నుంచి ప్రతి నెల మూడవ వారంలో పాలక మండలి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. బెజవాడలోని ముఖ్య కూడళల్లో దేవస్థానం తరుపున ఆర్చ్‌లు నిర్మించాలని పాలకమండలి ఆమోదించినట్టు సోమినాయుడు తెలిపారు.

విజయవాడ మీదుగా వెళ్లే ఏదైనా ఒక రైలుకు కనకదుర్గా ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని కోరనున్నారు. అలాగే కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించారు. అలాగే రోజుకు 5వేల మందికి అన్నదానం చేయాలని పాలకమండలి నిర్ణయించింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పలు టెండర్లను ఆమోదించినట్టు పైలా సోమినాయుడు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story