Vijayawada: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భవాని దీక్షలకు ఏర్పాట్లు

Vijayawada: దసరా ఉత్సవాల అనంతరం భవాని దీక్షలకు సిద్ధమవుతున్నారు విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ అధికారులు.

Arun Chilukuri
Published on: 17 Oct 2025 11:42 AM IST
Vijayawada: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భవాని దీక్షలకు ఏర్పాట్లు
X

Vijayawada: దసరా ఉత్సవాల అనంతరం భవాని దీక్షలకు సిద్ధమవుతున్నారు విజయవాడ కనక దుర్గమ్మ ఆలయ అధికారులు. కార్తీక మాసంలో చేపట్టే భవాని దీక్షలు డిసెంబర్ 2వ వారంలో విరమిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు స్వీకరించిన లక్షలాదిమంది భక్తులు.. గిరిప్రదక్షిణ కోసం విజయవాడకు చేరుకుంటారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శీను నాయక్ తెలిపారు. నూతన పాలకమండలి సభ్యులతో సమావేశంలో పాల్గొని నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు శీను నాయక్.

ఎన్నడు లేని విధంగా దసరా ఉత్సవాలకు లక్షల మంది భక్తులు తరలిరావడం సంతోషకరమన్నారు. దసరా ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి సీపీ రాధకృష్ణన్ కనక దుర్గమ్మను దర్శించుకోవడంతో ఆనందకరమన్నారు. ఉత్తరాది ప్రాంత ప్రజలు కూడా అమ్మవారి విశిష్టతలు తెలుసుకొని.. అమ్మవారి దర్శనార్ధం తరలి వస్తామనడం అభినందనీయమన్నారు. దీక్ష ఏర్పాట్లు విస్తృతస్థాయిలో చేసి... భవాని భక్తుల అభినందనలు అందుకోవడమే తమ లక్ష్యమని ఈవో తెలిపారు. కార్తీక మాసంలో నెల రోజులపాటు ప్రత్యేక పూజలతో పాటు కోటి దీపోత్సవం కూడా నిర్వహించునున్నట్లు ఆలయ ఈవో శీను నాయక్ తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story