దివ్య హత్యకేసులో ఇవాళ నిందితుడిని అరెస్ట్ చేసే అవకాశం

దివ్య హత్యకేసులో ఇవాళ నిందితుడిని అరెస్ట్ చేసే అవకాశం
x
Highlights

దివ్య హత్య కేసులో నిందితుడు నాగేంద్ర ఇవాళ జీజీహెచ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాబోతున్నాడు. దీంతో నాగేంద్ర డిశ్చార్జ్ కాగానే పోలీసులు అరెస్ట్...

దివ్య హత్య కేసులో నిందితుడు నాగేంద్ర ఇవాళ జీజీహెచ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కాబోతున్నాడు. దీంతో నాగేంద్ర డిశ్చార్జ్ కాగానే పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్‌ దా‍ఖలు చేస్తారు. ఈ కేసులో ఇప్పటివరకు 45 మందిని విచారించగా‎ ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులు మాత్రం దివ్యది సూసైడ్ కాదని చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయవాడ ఇంజినీరింగ్‌ విద్యార్థిని దివ్య హత్య కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. తమ మధ్య నెలకొన్న మనస్పర్థల కారణంగానే దివ్యను గొంతు కోసి నాగేంద్ర హత్య చేశాడని పోలీసులు భావించారు. అనంతరం తాను కత్తితో దాడి చేసుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలు కాగా జీజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు నిందితుడు నాగేంద్ర.

Show Full Article
Print Article
Next Story
More Stories