దివ్య తేజస్విని కేసులో కొత్త కోణం.. పోలీసుల విచారణలో షాకింగ్‌ విషయాలు

దివ్య తేజస్విని కేసులో కొత్త కోణం.. పోలీసుల విచారణలో షాకింగ్‌ విషయాలు
x
Highlights

సంచలనం రేపిన విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్ధిని దివ్య తేజస్విని హత్య కేసు విచారణలో షాకింగ్‌ విషయాలు బయటపడుతున్నాయి. దివ్య తేజస్విని తనను దూరం పెట్టడంతో...

సంచలనం రేపిన విజయవాడ ఇంజినీరింగ్ విద్యార్ధిని దివ్య తేజస్విని హత్య కేసు విచారణలో షాకింగ్‌ విషయాలు బయటపడుతున్నాయి. దివ్య తేజస్విని తనను దూరం పెట్టడంతో నాగేంద్ర, ఆమెపై కోపం పెంచుకున్నట్లు విచారణలో బయటపడింది. దివ్యపై కోపంతో పక్కా ప్లాన్ ప్రకారమే ఆమెను వేధింపులకు గురిచేశాడని తెలుస్తోంది. నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను సృష్టించిన నాగేంద్ర దివ్య స్నేహితుల సాయంతో ఆమెను వేధించాడని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

అయితే తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో కొద్దిమంది స్నేహితులకు మాత్రమే యాక్సెస్ ఇచ్చింది దివ్య. దీంతో దివ్యను వేధించేందుకు నాగేంద్ర, తన స్నేహితుల సాయాన్నే తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దివ్య యాక్సెస్ ఇచ్చిన స్నేహితులను విచారించేందుకు సిద్ధమయ్యారు. దివ్య హత్య జరిగిన నాటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరిగింది. తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లు నాగేంద్ర ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో కేసులో ట్విస్ట్‌ నెలకొనగా ఆ తర్వాత అతను చెప్పింది అంతా ఫేక్ అంటూ దివ్య తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ కేసు మిస్టరీగా మారింది. అయితే నాగేంద్ర స్టేట్‌మెంట్‌, దివ్య కుటుంబసభ్యుల ఫిర్యాదుపై లోతుగా విచారణ జరిపిన పోలీసులకు నాగేంద్ర చెప్పేదంతా కట్టుకథేనని తేలింది.

పోలీసుల విచారణలో నాగేంద్రతో దివ్యకు పెళ్లిజరిగినట్టు ఎక్కడా ఆధారాలు లభించలేదు. పెళ్లి జరిగిందని నిరూపించేందుకు దివ్య ఫోటోను కూడా మార్ఫ్‌ చేసినట్లు పోలీసులుగుర్తించారు. దీంతో ఈ కేసులో డొంక కదిలించేందుకు సిద్ధమవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories