దివ్య, స్వామి ప్రేమ పెళ్లి... దివ్య పేరెంట్స్‌కు తెలుసా..?

దివ్య, స్వామి ప్రేమ పెళ్లి... దివ్య పేరెంట్స్‌కు తెలుసా..?
x
Highlights

విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. దివ్య తేజస్విని, స్వామి ప్రేమించుకున్నారని ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని...

విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసు కొత్త మలుపు తిరుగుతోంది. దివ్య తేజస్విని, స్వామి ప్రేమించుకున్నారని ఇద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని నిందితుడు స్వామి సోదరుడు నాగరాజు చెబుతున్నాడు. వారిద్దరి మధ్య ఏడేళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోందని వాళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని అతగాడు అంటున్నాడు. నిన్న రాత్రి దివ్య ఇంటికెళ్లి ఆమె తండ్రితో కూడా మాట్లాడినట్లు చెప్పాడని, అయితే అక్కడ ఏం జరిగిందో తమకు పూర్తిగా తెలియదని స్వామి సోదరుడు నాగరాజు తెలిపాడు. అసలు నిన్న రాత్రి దివ్య ఇంట్లో ఏం జరిగిందో తమకు చెప్పలేదని, అంతేకాదు ఎవరిని ఎవరు పొడిచారో కూడా తెలియడం లేదని స్వామి సోదరుడు చెబుతున్నాడు. ఇద్దరికీ కత్తి గాయాలయ్యాయని అంతవరకే తమకు తెలుసంటున్నాడు స్వామి సోదరుడు నాగరాజు.

దివ్య, స్వామి ప్రేమ గురించి కూడా దివ్య తల్లిదండ్రులకు ముందే తెలుసా..? దివ్య, స్వామి పెళ్లి చేసుకున్న విషయం కూడా దివ్య పేరెంట్స్‌కు తెలుసా..? దివ్య, స్వామి ప్రేమ పెళ్లిని దివ్య పేరెంట్స్ అంగీకరించలేదా? దివ్య ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీ ఎందుకు కట్టి ఉంది? చున్నీతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నదెవరు? దివ్య తల్లిదండ్రులతో స్వామికి ఘర్షణ జరిగిందా? దివ్య ఇంట్లో అసలు ఏం జరిగింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రావాల్సి ఉంది.

తమ ప్రేమ పెళ్లి దివ్య కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదని దాంతో దివ్యను కట్టడి చేశారని నిందితుడు స్వామి చెప్పినట్లు తెలుస్తోంది. తామిద్దరం పెళ్లి చేసుకున్నామని, దివ్యను తన వెంట పంపాలని స్వామి కోరగా ఘర్షణ జరిగినట్లు చెబుతున్నారు. నిన్న రాత్రి దివ్య ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులతో స్వామి ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. మరోవైపు, దివ్య, స్వామి సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వామి స్నేహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రేమ పెళ్లి కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే, దివ్య తేజస్విని, తానూ ప్రేమించుకున్నట్లు, పెళ్లి కూడా చేసుకున్నట్లు నిందితుడు నాగేంద్ర బాబు అలియాస్ స్వామి పోలీసుల వాంగ్మూలంలో చెప్పినట్లు తెలుస్తోంది.

ప్రేమ పెళ్లి కోణంలో దివ్య తల్లిదండ్రులను పోలీసులు ప్రశ్నించారు. అయితే తమ కుమార్తెకు నాగేంద్రతో అస్సలు పరిచయమే లేదని దివ్య పేరెంట్స్ అంటున్నారు. తమ కుమార్తె ఇంజనీరింగ్ చదువుతోందని, చదువూసంధ్యా లేని నాగేంద్రతో దివ్యకు పెళ్లి ఎలా చేస్తామని దివ్య తల్లి ప్రశ్నిస్తోంది. దివ్య బంధువుల కూడా అదే అంటున్నారు.

అయితే, నాగేంద్ర మాత్రం ఇద్దరి మధ్య ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని, దివ్యను తాను మంగళగిరిలో పెళ్లి చేసుకున్నట్లు పోలీసులకు తెలిపాడు. నిన్న రాత్రి దివ్య తండ్రికి తనకు ఘర్షణ జరిగిందని తనను ఇష్టానుసారం దూషించినట్లు నాగేంద్ర తెలిపాడు. దివ్య నుంచి దూరంగా ఉండాలంటూ వార్నింగ్ ఇవ్వడంతో నాగేంద్ర ఇవాళ ఉదయం మరోసారి దివ్య ఇంటికి వెళ్లి ఆమెతో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. ఇంటికి వెళ్లిన సమయంలో వెంట ఎలాంటి ఆయుధాలు తీసుకెళ్ల లేదని దివ్య ఇంట్లో కత్తినే వినియోగించినట్లు నాగేంద్ర చెబుతున్నాడు. రక్తం ఎక్కువగా పోవడంతో నాగేంద్ర పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీపీ లెవెల్స్ పడిపోవడంతో రెండు రోజులు గడిస్తేనే గానీ ఏ విషయం చెప్పలేమని వైద్యులు అంటున్నారు. మరోవైపు దివ్య ఇంట్లో ఫ్యాన్ కు చీర వేళ్లాడుతుండటం బట్టి దివ్య ఆత్మహత్యకు ప్రయత్నించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories