విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసులో పురోగతి

విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసులో పురోగతి
x
Highlights

విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. సాక్షుల విచారణ పూర్తి చేసిన పోలీసులు ఛార్జిషీటు సిద్ధం చేశారు. పండగ సెలవులు ముగిశాక...

విజయవాడ దివ్య తేజస్విని హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. సాక్షుల విచారణ పూర్తి చేసిన పోలీసులు ఛార్జిషీటు సిద్ధం చేశారు. పండగ సెలవులు ముగిశాక కోర్టుకు ఛార్జిషీటు సమర్పించనున్నారు. మరోవైపు నిందితుడు నాగేంద్రను సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో డిశ్చార్జ్‌ అనంతరం నాగేంద్రను విచారించనున్నారు పోలీసులు.

దివ్య స్వయంగా గాయాలు చేసుకోలేదని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. దివ్యపై కత్తితో దాడి చేసి ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా నాగేంద్ర కోసుకున్నట్టు ఫోరెన్సిక్ నిపుణులు తేల్చి చెబుతున్నారు. దీంతో పోలీసులు వివిధ కోణాల్లో లోతుగా విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories